కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన వైఎస్ జగన్‌ కంటే తమతో కలవాలనుకొంటున్న చంద్రబాబునాయుడు మేలని  తిరుపతి మాజీ ఎంపీ  చింతా మోహన్  అభిప్రాయపడ్డారు


తిరుపతి: కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన వైఎస్ జగన్‌ కంటే తమతో కలవాలనుకొంటున్న చంద్రబాబునాయుడు మేలని తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలవాలనే నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలవాలనేది ఎన్టీఆర్ చివరి కోరికగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. 1995 లో ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీతో కలవాలనుకొన్నారని చింతామోహన్ ప్రస్తావించారు.

కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్ జగన్ ద్రోహం చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన జగన్‌ కంటే బాబే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీకి ఇచ్చిన హామీలను బీజేపీని విడిచి కాంగ్రెస్ పార్టీతో టీడీపీ చేరడం శుభపరిణామని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనకు కారణమని భావించి పార్టీని వీడిన నేతలంతా తిరిగి పార్టీలో చేరాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్‌తో పనిచేయాలని ఎన్టీఆర్ అనుకున్నారు.. పవన్‌ వచ్చినా ఓకే: చింతా మోహన్