Asianet News TeluguAsianet News Telugu

అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు  వైసీపీలో చేరారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. 

former team india cricketer ambati rayudu joins ysrcp in presence of ap cm ys jagan ksp
Author
First Published Dec 28, 2023, 8:03 PM IST

మరికొద్దినెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పలువురు ప్రముఖులు చట్టసభలకు పోటీ చేయాలని చూస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు  వైసీపీలో చేరారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. 

అనంతరం అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు తెలిపారు. తొలి నుంచి సీఎం జగన్‌పై తనకు మంచి అభిప్రాయం వుందని, కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నారని రాయుడు ప్రశంసించారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని రాయుడు సపష్టం చేశారు. 

కాగా.. టీమిండియాకు, ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత రాయుడు పలుమార్లు సీఎం జగన్‌ను కలిశారు. అప్పుడే ఆయన పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం జరిగింది. కానీ అంబటి రాయుడు మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయినప్పటికీ గుంటూరు జిల్లాలో విస్త్రతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు రాయుడు. ఈ నేపథ్యంలో ఇవాళ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. వైసీపీ కండువా కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాయుడిని గుంటూరు నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేయించే అవకాశాలు వున్నాయి. దీనిపై జగన్ నుంచి ఆయనకు స్పష్టమైన హామీ వచ్చినట్లుగా తెలుస్తోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios