విశాఖ జిల్లా నక్కపల్లి సమీపంలో టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కారు ప్రమాదానికి గురైంది. హైవేపై అదుపుతప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న అచ్చెన్నాయుడుతో సహా పలువురికి గాయాలయ్యాయి. అచ్చెన్నాయుడు చేతికి స్వల్ప గాయాలయ్యాయి. 

పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు.అచ్చెన్నాయుడు చేతికి గాయమైంది.ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే, ప్రమాదం ఏదీ లేదని అచ్చెన్నాయుడు తెలిపారు. చికిత్స అనంతరం ఆయన మరో కారులో ఇంటికి వెళ్లారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.