టిటిడిపై సీబీఐ విచారణ కోరిందే బాబు : ఉండవల్లి

former Rajahmundry MP Vundavalli Arunkumar slams on Chandrababu naidu
Highlights

టిటిడిపై సీబీఐ విచారణ కోరిందే బాబు : ఉండవల్లి

రాజమండ్రి:  టిటిడి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపణలపై  సీబీఐ విచారణ జరిపితే  నష్టమేమిటని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.బుధవారం  నాడు ఆయన  రాజమండ్రిలో  మీడియాతో మాట్లాడారు. 2008 అసెంబ్లీ సమావేశాల్లో  టిటిడి నిర్వహణపై  ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబునాయుడు సీబీఐ విచారణనిర్వహించాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్గు చేశారు.మహరాష్ట్రకు చెందిన ఓ మంత్రి భార్యను  టిటిడిలో సభ్యురాలిగా ఎందుకో చేర్చారో చెప్పాలని ఆయన కోరారు.ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహాన్ రెడ్డి  పార్లమెంట్ లో  అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి   ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓ అడుగు ముందుకు వేశారని ఆయన చెప్పారు.
 

loader