హైదరాబాద్: తాను అనుకొన్నది జరగడం కోసం సీఎం జగన్ ఎంత దూరం వరకైనా వెళ్తాడని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  అభిప్రాయపడ్డారు.

బుధవారం నాడు జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కేవలం ఎన్నికల కమిషన్ మాత్రమే జరపలేదన్నారు. ఎన్నికల నిర్వహణకు గాను ప్రభుత్వం కూడా సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

also read:స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దంగా లేదు: ఏపీ మంత్రి కొడాలి నాని

ఎన్నికల నిర్వహణకు గాను ప్రభుత్వమే నిధులను సమకూర్చాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదన్నారు.

రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ఎస్ఈసీ భావిస్తోంది.ఇదే విషయాన్ని కమిషనర్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దంగా లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ప్రకటించింది. ఈ విషయమై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు.