గుడివాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దంగా లేదని ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

బుధవారం నాడు ఆయన  గుడివాడలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదన్నారు. రాజ్యాంగ హోదాలో ఉన్న నిమ్మగడ్డ హుందాగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామనడం సరికాదన్నారు.కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకంగా ఆయన చెప్పారు.

చంద్రబాబు రాసిన లేఖకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ ప్రయత్నించడాన్ని మంత్రి తప్పుబట్టారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వహించేందుకు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దంగా ఉంది. 

also read:గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దంగా లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ప్రకటించారు. ఈ విషయాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. 

రాష్ట్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని కూడ ప్రశ్నించే విధంగా ఉందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయంతో ఉన్నారు.