నెల్లూరు: త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆనం కుటుంబీకుల మార్క్ చూపిస్తామని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.

బుధవారం నాడు ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి మరణంతో ఆనం కుటుంబం నగరానికి దూరమైందని భావించడం సరైంది కాదన్నారు. నగరంలోని ప్రతి కుటుంబంలోనూ తమ అభిమానులున్నారని ఆయన చెప్పారు. 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నారు.  మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీకి చెందిన కొందరు నేతలపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారని జిల్లా రాజకీయాల్లో చర్చ సాగుతోంది.

కొంత కాలంగా ఆయన  చేస్తున్న వ్యాఖ్యలు  నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆసక్తిని కల్గిస్తోంది. గత ఎన్నికలకు ముందు రామనారాయణరెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నుండి పోటీ చేసి విజయం సాధించాడు. ఆనం రామనారాయణరెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు వైసీపీలో తీవ్ర చర్చకు దారి తీసింది.