:మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  సమక్షంలో గురువారం నాడు  జనసేనలో చేరారు. కందుల దుర్గేష్    కాంగ్రెస్ , వైసీపీలలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి  సంఘం నాయకుడిగా  రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

హైదరాబాద్:మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  సమక్షంలో గురువారం నాడు  జనసేనలో చేరారు. కందుల దుర్గేష్    కాంగ్రెస్ , వైసీపీలలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి  సంఘం నాయకుడిగా  రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడ పనిచేశాడు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వైసీపీలో కూడ కొనసాగారు. వైసీపీకి కూడ దూరమై  జనసేనలో చేరారు.

కొంత కాలంగా ఆయన పార్టీ మారాలని భావిస్తున్నారు.ఈ మేరకు అనుచరులతో చర్చించి  జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకొన్నాడు.  కాంగ్రెస్ పార్టీకి దూరమైన  తర్వాత ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో కూడ  పరిస్థితులు నచ్చని కారణంగా  దుర్గేష్  రాజీనామా చేశాడు.

పవన్ కళ్యాణ్ నాయకత్వంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని  దుర్గేష్ అభిప్రాయపడుతున్నాడు. ఈ మేరకే తాను జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని నడపగల సత్తా  పవన్ కళ్యాణ్‌కు ఉందన్నారు. 

ప్రజల సమస్యను పరిష్కరించాలనే తపన ఉన్న గొప్ప నాయకుడని ఆయన చెప్పారు.ప్రజల బాధలను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన  రాజకీయాల్లోకి వచ్చారని ఆయన చెప్పారు. 

ఈ వార్త చదవండి

జగన్ కు 'కాపు' షాక్: జనసేనలోకి మాజీ ఎమ్మెల్సీ