Asianet News TeluguAsianet News Telugu

భూమిలో పాతరేస్తా: ఉద్యోగిపై మరోసారి టీడీపీ నేత తిట్ల దండకం

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్  మరోసారి ప్రభుత్వ ఉద్యోగిపై నోరు పారేసుకొన్నారు. సరుబుజ్జిలి ఇన్‌ చార్జి ఈఓపీఆర్‌డీ గూనపు వెంకట అప్పలనాయుడికి ఫోన్‌ చేసి బూతులు తిట్టాడు.  ఈ విషయమై తనకు రక్షణ కల్పించాలని ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Former MLA Kuna Ravikumar charged with misbehaviour
Author
Srikakulam, First Published Mar 2, 2020, 10:57 AM IST


శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్  మరో ప్రభుత్వ ఉద్యోగిని దుర్బాషలాడాడు.  ఈ విషయమై తనకు రక్షణ కల్పించాలని ఆ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also read:''సొమ్ములు పోనాయి, నానేటి సేత్తాను''... జగన్ వెంటే ఆ మంత్రి కూడా జైలుకే: కూన రవికుమార్

 ఆముదాలవల మాజీ ఎమ్మెల్యే  కూన రవికుమార్ సరుబుజ్జిలి ఇన్‌ చార్జి ఈఓపీఆర్‌డీ గూనపు వెంకట అప్పలనాయుడికి ఫోన్‌ చేసి బూతులు తిట్టాడు. ఈ విషయమై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

రావి వలస పంచాయితీలో డబ్బుల విషయమై  ఆయన సరుబుజ్జిలి ఇన్‌ చార్జి ఈఓపీఆర్‌డీకి ఫోన్‌ చేసి బూతులు తిట్టాడు. గతంలో కూడ సరుబుజ్జిలి ఎంపీడీఓను కూడ దూషించిన కేసులో రవికుమార్‌పై కేసు నమోదైంది,. ఈ కేసులో ఆయన బెయిల్‌పై ఉన్నాడు. 

గతంలో కూడ పలువురు అధికారులతో ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే రవికుమార్ దూషణకు దిగినట్టుగా ఆరోపణలు  ఉన్నాయి. గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ ఎ.దామోదరరావు, అప్పటి ఈఓపీఆర్‌డీ పీవీ మురళిమోహన్‌పై దూషణలకు దిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. .

‘ఆఫీసులోనే తులుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్వు ఎవరూ ఆపలేరు. చెప్పింది చేయకపోతే నేనెంటో చూపిస్తా’ అంటూ సరుబుజ్జిలి ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శిని మాజీ విప్‌ కూన రవికుమార్‌ బెదిరించినట్టుగా ప్రచారంలో ఉంది. తాజాగా ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయమై కూన రవికుమార్ పై బాధితుడు ఫిర్యాదు చేశాడు. 

ఫోన్‌ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని  ఈఓపీఆర్‌డీగా అప్పలనాయుడిని బండబూతులు తిట్టారు.  భూమిలో పాతేస్తానంటూ అప్పలనాయుడిని బెదిరించాడు. మళ్లీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే  ఇంటికి వచ్చి ఎత్తుకెళ్తానని బెదిరించాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios