Asianet News TeluguAsianet News Telugu

వినుకొండలో ఉద్రిక్తత: కోటప్పకొండకు జీవీ ఆంజనేయులు వెళ్లకుండా అడ్డగింత, హౌస్ అరెస్ట్

గుంటూరు జిల్లాలోని వినుకొండలో టీడీపీ, వైసీపీ ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. కోటప్పకొండ వద్ద ప్రమాణం చేసేందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జీవీ ఆంజనేయులును పోలీసులు అడ్డుకొన్నారు. 
 

Former MLA GV Anjaneyulu house arrested at Vinukonda in Guntur district lns
Author
Guntur, First Published May 28, 2021, 9:31 AM IST

గుంటూరు: గుంటూరు జిల్లాలోని వినుకొండలో టీడీపీ, వైసీపీ ల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. కోటప్పకొండ వద్ద ప్రమాణం చేసేందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జీవీ ఆంజనేయులును పోలీసులు అడ్డుకొన్నారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే  జీవీ ఆంజనేయులుకు చెందిన స్వచ్ఛంధ సంస్థకు ఎన్నారైల నుండి నిధులు వస్తున్నాయని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. తాను నిర్వహిస్తున్న స్వచ్ఛంధ సంస్థకు ఎన్నారైల నుండి నిధులు వస్తున్న విషయమై నిరూపించాలని  ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సవాల్ విసిరారు. 

ఈ విషయమై తాను కోటప్పకొండ  వద్ద ప్రమాణం చేస్తానని జీవీ ఆంజనేయులు సవాల్ చేశారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వచ్చంధ సంస్థకు కూడ నిధులు వస్తున్నాయని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఇవాళ ఉదయం 8 గంటలకు కోటప్పకొండకు వెళ్లేందుకు జీవీ ఆంజనేయులు ప్రయత్నించారు. అయితే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

గురువారం నాడు రాత్రే  జీవీ ఆంజనేయులుకు నోటీసులు జారీ చేశారు. వినుకొండలో 144 సెక్షన్ విధించారు.44 సెక్షన్ అమల్లో ఉన్నందున  కోటప్పకొండకు వెళ్లొద్దని  పోలీసులు అడ్డుకొన్నారు. పోలీసుల ఆదేశాలకు లోబడే తన స్వచ్ఛంధ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తోందని జీవీ ఆంజనేయులు ప్రకటించారు. ఉద్దేశ్యపూర్వకంగానే  తన సంస్థపై ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేస్తున్నారని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. జీవీ ఆంజనేయులు  ఇంటి వద్ద గురువారం నాడు రాత్రి నుండి భారీగా పోలీసులను మోహరించారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్ల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios