మాజీ మిస్ తెలంగాణ హసిని: మరోసారి ఆత్మహత్యాయత్నం.
2018లో మాజీ మిస్ తెలంగాణగా ఎంపికైన కలక భవాని అలియాస్ హాసిని మరోసారి ఆత్మహత్యాయత్నం చేసుకొంది. శుక్రవారం నాడు ఆమె నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జి పై నుండి మున్నేరులో దూకింది.వెంటనే ఆమెను గుర్తించిన స్థానికులు మున్నేరులోకి దూకి ఆమెను కాపాడారు
నందిగామ: మాజీ Miss Telangana కలక భవాని అలియాస్ Hasini మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమెను కాపాడిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది.శుక్రవారం నాడు ఆమె నందిగామ సమీపంలోని Keesara బ్రిడ్జి పై నుండి మున్నేరులో దూకింది.వెంటనే ఆమెను గుర్తించిన స్థానికులు మున్నేరులోకి దూకి ఆమెను కాపాడారు. మూడు రోజుల వ్యవధిలోనే ఆమె రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతుంది.
also read:ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టి.. మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం.. అదే కారణమా..?
హాసిని బుధవారం నాడు రాత్రి పదిన్నర గంటల సమయంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకొంటూ ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో కాల్ చేశారు. తల్లిదండ్రులు స్నేహితులు ఫోన్ చేస్తున్నా కూడా ఆమె పట్టించుకోలేదు. తాను చెప్పాలనుకొన్న విషయాలు చెప్పి స్టూల్ తన్నేసింది.
అయితే లైవ్ లో ఈ దృశ్యాలను చూసిన ఆమె స్నేహితుడు 100 ఫోన్ చేశారు. నారాయణగూడ పోలీసులు హిమాయత్‌నగర్ లో ఆమె ఉండే ఇంటికి చేరుకొన్నారు. అయితే ఆమె ఫ్యాన్ కు బిగించుకొన్న చున్నీ ముడి ఊడిపోయి మంచంపై పడిపోయింది. తలుపులు పగులగొట్టి ఆమెను ఆసుపత్రికి తరలించారు.గురువారం నాడు ఉదయం హాసినిని ఆమె కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు.
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం బుధవాడ గ్రామానికి చెందిన కలక భవాని అలియాస్ హాసిని హైద్రాబాద్ హిమాయత్‌నగర్ లోని ఓ అపార్ట్‌మెంట్ లో ఒంటరిగా నివాసం ఉంటుంది.2018 లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన పోటీలో హాసిని మిస్ తెలంగాణకు ఎంపికైంది.
బుధవారం నాడు హసీని ఆత్మహత్యాయత్నానికి ఆర్ధిక ఇబ్బందులే కారణమని చెప్పిందని నారాయణగూడ పోలీసులు చెప్పారు. అయితే రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేయడం వెనుక బలమైన కారణాలు ఉండి ఉండొచ్చనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.కృష్ణా జిల్లాకు చెందిన కాలక నాగభవాని అలియాస్ హసిని ఆరేళ్ల కింద హైదరాబాద్ వచ్చింది. చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో ఆమె మోడల్ గా రాణిస్తున్నారు.
ఆత్మహత్యకు ప్రయత్నించిన వారికి సైక్రియాటిస్టులతో ట్రీట్‌మెంట్ ఇప్పిస్తే మరోసారి ఆత్మహత్యాయత్నం చేయకుండా నివారించవచ్చు. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితుల గురించి తెలుసుకొని వాటిని మరిచిపోయేలా వారి మనసు కుదుటపడేలా కుటుంబసభ్యులు చూసుకోవాలని కూడ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఆత్మహత్యాయత్నం చేసిన వారిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. మానసిక ప్రశాంతత కలిగేలా వారిని కొత్త చోటుకు తీసుకెళ్తే ఈ ఆలోచనల నుండి కొంత దూరంగా వెళ్లే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. చనిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఏదైనా సమస్యను ఫేస్ చేసి విజయం సాధించడంపై దృష్టి పెట్టాలని సైక్రియాటిస్టులు సూచిస్తున్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం ద్వారా కొంత వారి ఆలోచనల నుండి మార్పు తీసుకు రావొచ్చు..సామాన్య కుటుంబంలో పుట్టినా హాసిని మోడలింగ్ రంగంలో ఆసక్తితో ఆ రంగంలో రాణిస్తున్నారు.పట్టుదలతో 2018 లో మిస్ తెలంగాణ టైటిల్ ను ఆమె దక్కించుకొన్నారని ఆమె స్నేహితులు చెబుతున్నారు.