ఏపీలో కాకరేపుతున్న బొత్స స్మశాన వ్యాఖ్యలు: మంత్రి బర్తరఫ్ కు టీడీపీ డిమాండ్

మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం వైఎస్ జగన్ ఎక్కడ కూర్చుంటున్నారు..? స్మశానంలోనే రోజూ కూర్చుంటున్నారా..? పరిపాలన ఎక్కడ నుంచి చేస్తున్నారు..? స్మశానంలో కూర్చుని పాలన చేస్తున్నారా..? అంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు. 

Former minister Yanamala Ramakrishnudu serious warning to minister Botsa Satya narayana

అమరావతి: నవ్యాంంధ్ర రాజధాని అమరావతిపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు.  రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. 

రాజధానిని స్మశానంతో పోల్చడం గర్హనీయమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 
ప్రజా దేవాలయంగా భావించే శాసన సభను స్మశానంతో పోల్చుతారా..? అంటూ మండిపడ్డారు.

న్యాయ దేవాలయం హైకోర్టును స్మశానంతో పోల్చుతారా..? సచివాలయం వీళ్ల కళ్లకు స్మశానంలా కనిపిస్తోందా..?  అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
అమరావతిలో 29 గ్రామాలను స్మశానంతో పోలుస్తారా..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

33వేల ఎకరాలిచ్చిన రైతుల త్యాగాలను అవహేళన చేసేలా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. బొత్స సత్యనారాయణను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని లేకపోతే స్మశానం వ్యాఖ్యల వెనుక సీఎం జగన్ ప్రోద్భలం ఉన్నట్లేనంటూ చెప్పుకొచ్చారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం వైఎస్ జగన్ ఎక్కడ కూర్చుంటున్నారు..? స్మశానంలోనే రోజూ కూర్చుంటున్నారా..? పరిపాలన ఎక్కడ నుంచి చేస్తున్నారు..? స్మశానంలో కూర్చుని పాలన చేస్తున్నారా..? అంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు. 

అమరావతిని స్మశానంగా మిగిల్చారు: చంద్రబాబుపై బొత్స ఫైర్

దేవేంద్రుడి రాజధాని అమరావతిగా చరిత్ర చెప్తోంది. ప్రధాని మోడి మన అమరావతికి వచ్చి శంకుస్థాపన చేశారు. పుణ్యనదులు, పుణ్యక్షేత్రాల మట్టితో శంకుస్థాపన చేశామని యనమల గుర్తు చేశారు. 

దేశ, విదేశీ ప్రతినిధులంతా అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యారు. మ్యాప్ లో అమరావతిని చూపకపోతే టీడీపీ ఎంపీలు లోక్ సభలో పట్టుబట్టి సాధించారని చెప్పుకొచ్చారు. రాజధానిగా అమరావతిని గుర్తిస్తున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీయే చెప్పారని తెలిపారు.

కేంద్రప్రభుత్వమే రాజధానిని గుర్తిస్తే వైసీపీ నేతలు అమరావతిని అభివృద్ది చేయకపోగా అవమానించడం దురదృష్టకరమన్నారు. చట్టసభలను అవమానించినందుకు ప్రివిలేజ్ నోటీసు ఇస్తామన్నారు. రాజధాని ప్రజలనే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలను మంత్రి బొత్స అవమానించారంటూ యనమల ధ్వజమెత్తారు. 

మంత్రిగా ఉండే అర్హతను బొత్స సత్యనారాయణ కోల్పోయారని హెచ్చరించారు. బొత్సను వెంటనే మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేయాలని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios