మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ జనసేనలో చేరే అవకాశం ఉందని  ప్రచారం సాగుతోంది. 

కాకినాడ: మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల దోస్తీతో తీవ్ర మనోవేదనకు గురైన వట్టి వసంత్‌కుమార్ కాంగ్రెస్ పార్టీకి గురువారం రాత్రి రాజీనామా చేశారు. వట్టి వసంత్‌కుమార్ జనసేన వైపు అడుగులు వేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీకి వీర విదేయుడుగా ఉన్న వట్టి వసంత్‌కుమార్ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య దోస్తీని జీర్ణించుకోలేకపోయినట్టు చెబుతున్నారు. న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమైన కొద్ది గంటల్లోనే వట్టి వసంత్ కుమార్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. 

2014లో రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన మాత్రం వ్యతిరేకించలేదు.కానీ ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం, ఏలూరు నుండి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఈ మేరకు వట్టి వసంత్ కుమార్ ప్లాన్ చేసుకొంటున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కూడ వసంత్ కుమార్ ఇటీవల కాలంలో పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. అయితే ఈ సమయంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య దోస్తీతో మనోవేదనకు గురైన వట్టి వసంత్ కుమార్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. వట్టి వసంత్ కుమార్ జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

చంద్రబాబుతో రాహుల్ భేటీ ఎఫెక్ట్: కాంగ్రెసుకు వట్టి రాజీనామా