Asianet News TeluguAsianet News Telugu

ఆందోళనలు చేస్తే ప్రైవేటీకరణ ఆగదు: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సుజనా చౌదరి

పెట్టుబడులు పెంచేందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకొందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చెప్పారు.
 

Former minister sujana chowdary reacts on visakhapatnam steel plant privatisation lns
Author
Visakhapatnam, First Published Feb 5, 2021, 4:38 PM IST

అమరావతి:పెట్టుబడులు పెంచేందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకొందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చెప్పారు.శుక్రవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. షేర్ హోల్డర్లకు లాభాలు తెచ్చేందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు.

టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలు ఆందోళనలు చేసినంత మాత్రాన ప్రైవేటీకరణ ఆగదని ఆయన తేల్చి చెప్పారు.విశాఖ స్టీల్ ప్లాంట్ వేరే దేశానికి తీసుకెళ్లేది కాదన్నారు. స్టీల్ ప్లాంట్ విశాఖలోనే ఉంటుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వం వ్యాపారం చేయకూడదనేది నిర్ణయంగా ఆయన వివరించారు.

విశాఖలోని  స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న విశాఖ స్టీల్ ప్యాక్టరీని ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకొంది.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి.ఈ ఆందోళనలకు  పలు రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి.

Follow Us:
Download App:
  • android
  • ios