అమరావతి: మాజీ మంత్రి సిద్దా రాఘవరావు కొడుకు సుధీర్‌తో కలిసి బుధవారం నాడు వైసీపీలో చేరారు.

బుధవారం నాడు జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి ఆయన సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకొన్నారు.సీఎం వైఎస్ జగన్ సిద్దా రాఘవరావుతో పాటు ఆయన తనయుడు సుధీర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఏడాది కాలంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుందని ఆయన చెప్పారు. ఈ సంక్షేమ పథకాలను నచ్చి వైసీపీలో చేరినట్టుగా ఆయన చెప్పారు.

also read:బాబుకు షాక్: వైసీపీలో చేరిన మాజీ మంత్రి సిద్దా రాఘవరావు

ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలపై వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఇప్పటికే ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి మద్దతు ప్రకటించారు. బలరాం తనయుడు కరణం వెంకటేష్ వైసీపీలో చేరారు.

మరికొందరు ఎమ్మెల్యేలపై కూడ వైసీపీ నాయకత్వం గాలం వేస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే సిద్దా రాఘవరావు టీడీపీని వీడి ఇవాళ వైసీపీలో చేరారు.
సిద్దా రాఘవరావుకు చెందిన వ్యాపారాలపై  అధికారులు  దాడులు నిర్వహించారు.

నోటీసులు జారీ చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ పార్టీ నేతలపై వైసీపీ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపణలు చేసింది.