Asianet News TeluguAsianet News Telugu

విజయవాడలో గెలిచిన వెంటనే 2 లక్షల ఇళ్లు పేదలకు పంపిణీ: మాజీ మంత్రి పరిటాల

 టిడిపి హయాంలో నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న సుమారు 2లక్షల ఇళ్లను పురపాలక ఎన్నికల్లో గెలిచిన వెంటనే అర్హులకు అందజేస్తామని మాజీ మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. పురపాలక ఎన్నికల్లో టిడిపి గెలుపును ఎవరూ ఆపలేరని, ఈ ఇళ్ళ పంపకాలను ఎవరూ అడ్డుకోలేరన్నారు.
 

former minister paritala sunitha urges to vote TDP in vijayawada mayor elections lns
Author
Vijayawada, First Published Mar 6, 2021, 6:19 PM IST


అమరావతి, మార్చి 6: టిడిపి హయాంలో నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న సుమారు 2లక్షల ఇళ్లను పురపాలక ఎన్నికల్లో గెలిచిన వెంటనే అర్హులకు అందజేస్తామని మాజీ మంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. పురపాలక ఎన్నికల్లో టిడిపి గెలుపును ఎవరూ ఆపలేరని, ఈ ఇళ్ళ పంపకాలను ఎవరూ అడ్డుకోలేరన్నారు.

 శనివారం నాడు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తయి 20నెలలు గడిచినా ఇప్పటికీ వైసిపి ప్రభుత్వం లబ్ధిదారులకు అందించడంలో విఫలమైందని విమర్శించారు. 

పారిశుద్ధ్య కార్మికుల జీతాలను 21వేలకు పెంచుతామని భరోసా ఇచ్చారు.  అదేవిధంగా ఆటో కార్మికులకు శాశ్వత ఆటోస్టాండ్ నిర్మిస్తామని తెలిపారు. అక్కడ మంచినీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పిస్తామన్నారు. 

డ్వాక్రా మహిళల కోసం సమావేశ మందిరాలు, మార్కెట్ బజార్లు నిర్మిస్తామని,  బ్యాంకుల ద్వారా సున్నా వడ్డీ రుణాలు అందజేస్తామని చెప్పారు. ఇవన్నీ టిడిపి మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

45ఎళ్లు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళలకు నెలకు మూడువేల రూపాయల పెన్షన్ ఇస్తానని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు. నెలకు మూడువేల చొప్పున ఒక్కో మహిళకు ఏడాదికి 36వేల రూపాయలు జగన్ రెడ్డి ఇవ్వాలన్నారు.. కానీ, వైఎస్సార్ చేయూత అనే పథకం ద్వారా కేవలం 18వేల 750 రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు.

మహిళలపై అఘయిత్యాలు పెరుగుతున్నాయి. గడచిన 20నెలల్లో ఇవి విపరీతంగా పెరిగాయని కేంద్ర నేరపరిశోధన విభాగం ఇచ్చిన 2020 నివేదిక తేటతెల్లం చేస్తోందని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అదేవిధంగా కరోనా కాలంలో పారిశుద్ధ్య కార్మికులకు మాస్క్, శానిటైజర్లు అడిగిన పాపానికి నగరి మున్సిపల్ కమిషనర్ కె.వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వమేనని ఆమె గుర్తు చేశారు. కార్మికులకు మాస్కులు కూడా ఇవ్వని జగన్ రెడ్డి ప్రభుత్వానికి పురపాలక ఎన్నికలోల తగిన గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios