అనంతలో ఉద్రిక్తత:చెన్నెకొత్తపల్లి పోలీస్‌స్టేషన్ ముందు పరిటాల సునీత ఆందోళన
శ్రీసత్యసాయి హిందూపురం జిల్లా చెన్నెకొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టీడీపీ నేత జగ్గును విడుదల చేయాలని కోరుతూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు.
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత,ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ , మాజీ ఎమ్మెల్యేల బీకే పార్థసారథి టీడీపీ శ్రేణులు ఆదివారం నాడు ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు , లోకేష్ లను చంపుతామన్నారు. అంతేకాదు పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తామని రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలుు చేశారు.ఈ వ్యాఖ్యలకు బత్తలపల్లికి చెందిన టీడీపీ నేత జగ్గు కౌంటరిచ్చారు. ఈ వ్యాఖ్యలపై జగ్గును శనివారంనాడు అర్ధరాత్రి పోలీసులు తీసుకెళ్లారని టీడీపీ నేతలు ఆరోపించారు. జగ్గు కోసం చెన్నే కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన తమ పార్టీ నేతలపై వైసీపీ నేతలు దాడికి దిగారని మాజీ మంత్రి పరిటాల సునీత చెప్పారు. జగ్గు అనుకొని పొరపాటున ఆయన సోదరుడిని తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని సునీత ఆరోపించారు. టీడీపీ నేత జగ్గును వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇవాళ ఉదయం నుండి చెన్నెకొత్తపల్లి పోలీస్ స్టేషన్ ముందు టీడీపీ నేతలు ఆందోళనలకు దిగారు. వైసీపీ నేతలకు సహకరించిన చెన్నెకొత్తపల్లి పోలీసులను సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు. చెన్నెకొత్తపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో టీడీపీ నేతల వాహనాలను వైసీపీ నేతలు ధ్వంసం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు.
టీడీపీ చీప్ చంద్రబాబు, లోకేష్ లను చంపుతామని వ్యాఖ్యానించిన తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిపై కేసులు నమోదు చేయాలని పరిటాల సునీత కోరారు.
బత్తలపల్లి మండలానికి చెందిన టీడీపీ నేత జగ్గును అరెస్ట్ చేసే వరకు తాము ఆందోళన విరమించోమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని కూడా సునీత డిమాండ్ చేశారు.