Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అరెస్టైతే లోకేష్ బిత్తర చూపులు: కొడాలి నాని సెటైర్లు

చంద్రబాబు, లోకేష్ లపై  ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని  విమర్శలు గుప్పించారు. అవినీతికి పాల్పడితే  అరెస్ట్ చేయరా అని ఆయన ప్రశ్నించారు.
 

Former Minister  Kodali Nani Satirical Comments on Chandrababunaidu and  Nara Lokesh lns
Author
First Published Sep 26, 2023, 3:18 PM IST

అమరావతి: చంద్రబాబు అరెస్టైతే  తిరునాళ్లల్లో తప్పిపోయిన పిల్లాడిలా లోకేష్ బిత్తర చూపులు  చూశాడని  మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.మంగళవారంనాడు మాజీ మంత్రి కొడాలి నాని  అమరావతిలో మీడియాతో మాట్లాడారు. తనపై తప్పుడు ప్రచారం చేశారు... ఇప్పటి వరకు  ఏమైనా నిరూపించారా అని చంద్రబాబు ఇంతకాలం ప్రచారం చేసుకున్న విషయాన్ని  కొడాలి నాని ప్రస్తావించారు. పీకండి.. కొట్టండి.. జైల్లో పెట్టండి.. నిరూపించండి అన్నాడు.. ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడన్నారు.
రాత్రికి రాత్రి 2 వేల పేజీలతో మెమోలు తయారు చేస్తారా అని నాని ప్రశ్నించారు.ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవని ప్రకటించిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడని అడిగారు. చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అడెవడో స్టార్ వస్తే.. వాడిని లోకేష్ అన్నయ్య అంటాడు.ఓ పక్కన అన్నయ్యను.. మరో పక్క మామయ్యను పెట్టుకుని ఏదో చేద్దామని లోకేష్ అనుకుంటున్నాడన్నారు.చంద్రబాబు గతంలో కమిషన్లకు కక్కుర్తి పడేవాడన్నారు.కానీ కమీషన్లకు బదులు మొత్తం స్వాహా చేసేందుకు  బాబు ప్రయత్నించారన్నారు. దోపీడీకి పాల్పడిన సొమ్మును కుటుంబ సభ్యులకు కన్వర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి నాని ఆరోపించారు. 

చంద్రబాబుకు ఒంటికాయ శొంఠి కొమ్ములా లోకేష్.. ఓ భార్య.. ఓ కోడలు మాత్రమే ఉన్నారన్నారు. ఆ ముగ్గురే ములాకాత్ కు వెళ్తోంది.. కుటుంబ సభ్యులంటూ వేరే వార్ని ఎవరినైనా రానిస్తున్నారా..? అని నాని అడిగారు.లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని కేసు పెట్టాల్సిన అవసరం ఏముందన్నారు.లోకేష్ మా పేర్లు రెడ్ బుక్ లో రాస్తుంటే... తాము మాత్రం లోకేష్ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమన్నారు.

2 శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే కోట్లు వస్తాయని  భువనేశ్వరీ అంటున్నారు.హెరిటేజ్ షేర్లు అమ్మి ప్రజలకు డబ్బులేమైనా పంచుతారా..? అని  నాని ప్రశ్నించారు. తన భర్తకు వసతుల్లేవు.. వేడి నీళ్లు లేవని భవనేశ్వరీ అంటున్నారు. ఏసీలు.. ప్రిజ్.. కూలర్లు.. బెడ్స్ ఉండడానికి అదేం ఇల్లు కాదు.. జైలు అనే విషయాన్ని భువనేశ్వరి గుర్తుంచుకోవాలన్నారు. జైల్లో ఏమైనా వసతులు కావాలంటే కోర్టును అడగాలని నాని సూచించారు. చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నంత కాలం తమకు  తిరుగు లేదన్నారు.జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశీ, మేనకలు కన్ను కొడతారా అని అడిగారు. చంద్రబాబు కోసం యాత్రలు చేసేది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారేనన్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన  వాళ్లకే కార్లు ఎక్కువగా ఉన్నాయని నాని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios