మాజీ మంత్రి, టీడీపీ నేత ఖలీల్ బాషా టీడీపీని వీడనున్నారు. ఎల్లుండి ఖలీల్ బాషా  వైసీపీలో చేరనున్నారు.మంగళవారం నాడు హైద్రాబాద్‌ లోటస్‌పాండ్‌లో ఖలీల్ బాషా వైఎస్ జగన్‌ను కలిసే అవకాశం ఉంది.

కడప: మాజీ మంత్రి, టీడీపీ నేత ఖలీల్ బాషా టీడీపీని వీడనున్నారు. ఎల్లుండి ఖలీల్ బాషా వైసీపీలో చేరనున్నారు.మంగళవారం నాడు హైద్రాబాద్‌ లోటస్‌పాండ్‌లో ఖలీల్ బాషా వైఎస్ జగన్‌ను కలిసే అవకాశం ఉంది.

మాజీ మంత్రి ఖలీల్ బాషా టీడీపీని వీడాలని భావిస్తున్నారు. ఇటీవలనే మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు.వచ్చే ఎన్నికల్లో కడప అసెంబ్లీ స్థానం నుండి అహ్మదుల్లా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఖలీల్ బాషా టీడీపీని వీడాలని భావిస్తున్నారు. 

కడప అసెంబ్లీ టిక్కెట్టు విషయమై టీడీపీ నాయకత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఖలీల్ బాషా అనుచరులు పార్టీకి రాజీనామా చేస్తామని మూడు రోజుల క్రితం ప్రకటించారు.

అయితే ఈ విషయమై టీడీపీ జిల్లా నాయకులు ఖలీల్ బాషా అనుచరులను సముదాయించారు. కానీ, ఖలీల్ బాషా టీడీపీని వీడి వైసీపీలో చేరాలని భావిస్తున్నారు. మంగళవారం నాడు లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ను ఖలీల్ బాషా కలవనున్నారు.

సమరశంఖారావం కార్యక్రమంలో భాగంగా జగన్ ఎల్లుండి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో ఖలీల్ బాషా వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.