టీడీపీ ఆఫీస్‌కి బుచ్చయ్య చౌదరి: చంద్రబాబుతో భేటీ
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుంటూరులోని టీడీపీ కార్యాలయానికి గురువారం నాడు వచ్చారు. కొంత కాలంగా పార్టీ నాయకత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నాడు. దీంతో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
గుంటూరు: టీడీపీ కేంద్ర కార్యాలయానికి మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారంనాడు మధ్యాహ్నం వచ్చారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బుచ్చయ్య చౌదరి గత నెలలో సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. దీంతో బుచ్చయ్య చౌదరితో తెలుగుదేశం నాయకత్వం సంప్రదింపులు జరిపింది. ఇవాళ పార్టీ కార్యాలయంలో ఆయన చం్రబాబుతో భేటీ అయ్యారు.
also read:బుచ్చయ్య చౌదరికి టీడీపీ బుజ్జగింపులు: గోరంట్లతో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ
పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో పలువురు పార్టీ ముఖ్యులు ఆయనతో విడతల వారీగా చర్చించారు. దీంతో ఆయన రాజీనామా విషయమై మెత్తబడ్డారని సమాచారం. దీంతో తన డిమాండ్లపై పార్టీ ముఖ్యులతో బుచ్చయ్య చౌదరి చర్చించనున్నారు.
మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కూడ గోరంట్ల బుచ్చయ్య చౌదరితో పార్టీ కార్యాలయానికి చేరుకొన్నారు. పార్టీ ముఖ్యులతో తన డిమాండ్లపై చర్చించనున్నారు బుచ్చయ్య చౌదరి. ఆ తర్వాత బుచ్చయ్య చౌదరి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు.