విశాఖపట్టణం: అమరావతి విషయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు యూ టర్న్ తీసుకొన్నారు. విశాఖలో రాజధాని వస్తే  శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే విషయమై సాగుతున్న ప్రచారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.  

అమరావతికి మద్దతివ్వాలన్న పార్టీ ఆదేశాలకు తాను కట్టుబడి ఉన్నానని గంటా శ్రీనివాసరావు తేల్చి చెప్పారు.మంగళవారం నాడు విశాఖపట్టణంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. 

 విశాఖ వాసిగా విఖాపట్టణం వాణిజ్య రాజధాని విషయంలో తాను కట్టుబడి ఉన్నట్టుగా గంటా శ్రీనివాసరావు చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు న్యూ ఈయర్ వేడుకలకు తాను దూరంగా ఉంటానని ఆయన చెప్పారు.  పార్టీ ఇచ్చిన ఆదేశాలను తాను కచ్చితంగా పాటిస్తానని తేల్చి చెప్పారు.

అమరావతికి భూములిచ్చిన రైతులకు కూడ న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. విశాఖలో రాజధాని వస్తే శాంతిభద్రతలు లోపిస్తాయనే భయాందోళనలను ప్రభుత్వం తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.