Asianet News TeluguAsianet News Telugu

ధర్మాన కీలక వ్యాఖ్యలు: కొత్త జిల్లాల ఏర్పాటులో జగన్‌కి తలనొప్పులు

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ ప్లాన్ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయం సీఎం జగన్ కు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు  ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు

former minister Dharmana prasada Rao sensational comments on new districts
Author
Srikakulam, First Published Jul 9, 2020, 10:49 AM IST

అమరావతి:రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ ప్లాన్ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయం సీఎం జగన్ కు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు  ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.ఇటీవల జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని జగన్ ఎన్నికల సమయంలో  జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. తెలంగాణలో తొలుత ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించింది ఆ ప్రభుత్వం. తెలంగాణ బాటలోనే ఏపీ ప్రభుత్వం కూడ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనుంది.

also read:తెలంగాణ బాటలోనే ఏపీ: మరో 12 జిల్లాల ఏర్పాటుకు సర్కార్ కసరత్తు
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో క్షేత్రస్థాయిలో ప్రజలు కొత్త డిమాండ్లను లేవనెత్తుతున్నారు. తమ ప్రాంత ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని  ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కొత్త జిల్లాల విషయంలో ప్రజా ప్రతినిధులు, పార్టీలు కూడ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నాయి.  మదనపల్లిని కూడ జిల్లా చేయాలనే డిమాండ్ నెలకొంది.

తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడ కొత్త జిల్లాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగితే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి శూన్యంగా మారనుందని బుధవారం నాడు వ్యాఖ్యానించారు. 

జిల్లాలో అభివృద్ధి చెందిన ఎచ్చెర్ల, పాలకొండ, రాజాం ప్రాంతాలు కొత్త జిల్లాల విభజనలో భాగంగా విజయనగరం జిల్లాలో కలసిపోతాయన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అదే జరిగితే జిల్లా అభివృద్ధి 80 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జిల్లాల విభజనపై నిర్ణయం తీసుకోవద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ప్రజలు, నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేయాలని ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వానికి సూచించారు. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేయవద్దని కోరారు. అదే జరిగితే ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం దొరుకుతోందన్నారు.  ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు.

ప్రజల మనోభావాలు సున్నితమైనవి... అవి దెబ్బతినకుండా ప్రజల అభిప్రాయాల మేరకు జిల్లాల పునర్విభజన జరుగుతోందని  ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios