Asianet News TeluguAsianet News Telugu

కాళ్ళకు పారాణి ఆరలేదనటానికి సిగ్గుండాలి.. నవంబర్ 1న సిఎం జగన్..

 భవన కార్మికుల ఆత్మహత్యలు జరుగుతుంటే సిఎంకు కనిపించలేదా?. రోమ్ చక్రవర్తి రోమ్ తగులపడుతుంటే ఫిడేలు వాయించినట్టు, భవన కార్మికుల ఆత్మహత్యలు జరుగుతుంటే జగన్ వీడియో గేమ్ ఆడుకుంటున్నారlని తెలుగుదేశం నేత మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు విమర్శంచారు.

Former Minister Devineni Uma Slams At Jagan
Author
Vijayawada, First Published Nov 3, 2019, 6:08 PM IST

మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నవంబర్ 1న ఛీఫ్ సెక్రెటరీకి వచ్చిన షోకాజ్ నోటీసులపై సిఎం వివరణ ఇవ్వాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ దోపిడీ చేయబోతున్నారు  ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ..

సిఎం జగన్ అనుభవ రాహిత్యం వల్లనే ఉన్నతాధికారుల షోకాజ్ నోటీసులు అందాయి. ఆరు నెలలయినా కాళ్ళకు పారాణి ఆరలేదనటానికి సిగ్గుండాలి. కంచికచెర్లలో ఇసుక లారీలు పట్టుబడ్డాయి అనంతపురం నుంచి ఇసుక బెంగుళూరు తరలిపోతోందని మొత్తుకుంటుంటే సిఎంకు కనపడటం లేదు కంచికచర్ల మార్కెట్ యార్డ్ లో పట్టుబడ్డ ఇసుక లారీలకు పర్మిట్టలు పుట్టించి హైదరాబాదు తరలిస్తున్నారు.

ఇసుకే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. పీకల మీదకి తెచ్చింది: నాగబాబు

భవన కార్మికుల ఆత్మహత్యలు జరుగుతుంటే సిఎంకు కనిపించలేదా?. రోమ్ చక్రవర్తి రోమ్ తగులపడుతుంటే ఫిడేలు వాయించినట్టు, భవన కార్మికుల ఆత్మహత్యలు జరుగుతుంటే జగన్ వీడియో గేమ్ ఆడుకుంటున్నారు మీడియా ముందు ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టడం లేద"న్నారు.

సిఎం జగన్ అన్నిరాష్ట్రాలలో వానలు పడటం లేదా, వరదలు రావట్లేదా, ఇసుక దొరకట్లేదా!. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అవుతానన్న జగన్, ఏమీ కాలేకపోయాడు938 జిఓను మీడియాకు భయపడి రాజశేఖరరెడ్డి పక్కన పెడితే, ఆ జీఓకు నగిషీలు చెక్కి జిఓ 2430 గా ఇచ్చి అప్రకటిత ఎమర్జెన్సీ క్రియేట్ చేశారు. యధా సిఎం తధా మంత్రులు అన్నట్టు బాధ్యతారాహిత్యంగా ఉన్నార"న్నారు.

చంద్రబాబు డైరెక్షన్ లోనే పిల్లసేన లాంగ్ మార్చ్...పవన్ కు రెమ్యునరేషన్...''

పత్రికలకు కూడా కులాలు ఆపాదిస్తున్నారు. సాక్షి మీడియా పునరావాస ప్రభుత్వంగా జగన్ మార్చారు. పాదయాత్రలో జగన్ అన్ని తిట్లు తిట్టి, ఇప్పుడు భవన కార్మికులను ఎందుకు ఓదార్చలేరు నవంబర్ 1న సిఎం జగన్ ప్రసంగంలో తెలుగుపై క్లారిటీ ఇస్తే అర్ధం చేసుకుంటాం. సజ్జల రామకృష్ణా రెడ్డి తయారు చేసిన బిజినెస్ రూల్స్ కు అనుగుణంగా జిఓలు రానున్నాయా" అనేదానికి ప్రభుత్వం సమాదానం చేప్పాలంటూ జగన్‌పై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.

 

.

Follow Us:
Download App:
  • android
  • ios