Asianet News TeluguAsianet News Telugu

జగన్‌తో ఆనం భేటీ: ఆఫర్స్‌పైనే చర్చ

మాజీ మంత్రి టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి గురువారం నాడు హైద్రాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలిశారు.మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిలు ఆనంను జగన్ వద్దకు తీసుకొచ్చారు.

Former minister Anam Ramanarayana Reddy meets Ys Jagan

హైదరాబాద్: మాజీ మంత్రి టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి గురువారం నాడు హైద్రాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ను కలిశారు.మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిలు ఆనంను జగన్ వద్దకు తీసుకొచ్చారు.

టీడీపీ అధిష్టానం తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఆనం రామనారాయణరెడ్డి జగన్‌తో సమావేశమయ్యారు.


కొంతకాలం పాటుగా  వైసీపీలో చేరాలని ఆనం రామనారాయణరెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు  వైసీపీలో చేరితే  ఏ అసెంబ్లీ స్థానాన్ని తనకు కేటాయిస్తారనే విషయమై ఆ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని తనకు కేటాయించాలని ఆయన కోరుతున్నారు. అయితే  ఆనం కోరుతున్న స్థానాల్లో కొన్ని వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే సిట్టింగ్‌లకు ఇబ్బందులు లేకుండా ఆనం రామనారాయణరెడ్డికి టిక్కెట్టు కేటాయించేలా  వైసీపీ ప్లాన్ చేస్తోంది. సుమారు గంటకుపైగా వైఎస్ జగన్‌తో ఆనం రామనారాయణరెడ్డి చర్చించారు.

ఇదిలా ఉంటే  ఆనం జయకుమార్ రెడ్డి మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. ఆనం సోదరుల కంటే ముందే జయకుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. మరోవైపు ఆనం వివేకానందరెడ్డి  , రామనారాయణరెడ్డి ఇద్దరూ కూడ ఒకేసారి ఎమ్మెల్సీ పదవులు అడగడంతో  ఎవరికీ కూడ ఎమ్మెల్సీ పదవులను ఇవ్వలేకపోయినట్టు చంద్రబాబునాయుడు ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా నేతల సమావేశంలో వ్యాఖ్యానించారు.

నెల్లూరు జిల్లా వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని వైసీపీ చీఫ్ జగన్ ఆనం రామనారాయణరెడ్డిని కోరినట్టు సమాచారం.

 

Follow Us:
Download App:
  • android
  • ios