ధర్మవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు రూ.1.60 కోట్ల జరిమానా.. ఎందుకంటే...
స్టోన్ క్వారీలో అక్రమాలకు పాల్పడిన విషయంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకు రూ.1.60 కోట్ల జరిమానా విధించింది గనుల శాఖ.

అనంతపురం : ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణకుఏకంగా రూ.1.60 కోట్ల జరిమానా పడింది. గోనుగుంట్ల సూర్యనారాయణను వరదపురం సూరి అని కూడా పిలుస్తారు. ఈయనకు చెందిన స్టోన్ క్రషర్ యూనిట్ నిర్వహణలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని భూగర్భ గనుల శాఖ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో వెల్లడయింది. దీంతో ఈ మేరకు జరిమానా విధించినట్లుగా తెలిసింది.
అనంతపురం రూరల్ మండలం కృష్ణంరెడ్డిపల్లి సమీపంలోని సర్వేనెంబర్ 40-4, 53లో వరదాపురం సూరికి చెందిన నితిన్ సాయి కన్స్ట్రక్షన్ సంస్థ పేరుతో ఓ స్టోన్ క్రషర్ యూనిట్ నడుపుతున్నారు. దీనికోసం పక్కనే ఉన్న క్వారీ నుంచి రోడ్డు మెటల్ ను క్రషర్ లోకి తరలించి.. అక్కడ 6 ఎంఎం, 12 ఎంఎం, 20 ఎంఎం, 40 ఎంఎం… వివిధ రకాల కంకరతో పాటు డస్ట్ గా మార్చి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.
తీర్పులు అనుకూలంగా రాకుంటే న్యాయమూర్తులపై ట్రోలింగ్.. వారంతా అసాంఘీక శక్తులే: సీఎం జగన్
ఈ క్వారీ మీద అనుమానంతో ఇటీవల గనుల శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. దీంట్లో క్వారీ నుంచి తరలించిన స్టాక్ కు, క్రషర్ లో ఉన్న స్టాక్ కు భారీవ్యత్యాసం కనిపించింది. చియ్యేడు గ్రామ సమీపంలోని క్వారీ నుంచి తీసుకొచ్చిన రోడ్డు మెటల్ స్టాక్ కు.. స్టోన్ క్రషర్ లో ఉన్న రోడ్డు మెటల్ స్టాకు మధ్య ఉన్న వివరాల్లో… భారీ వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు. దీంతో క్వారీలో కొలతలు నిర్వహించారు.
ఈ కొలతల్లో క్రషర్ యూనిట్ నిర్వహకులు 24,370 క్యూబిక్ మీటర్లకు సంబంధించిన వివరాలను రికార్డుల్లో చూపలేదు. దీనికి ఎలాంటి సీనరేజీ చెల్లించడం లేదు. అయినా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్లుగా అధికారుల తనిఖీల్లో గుర్తించారు. ఈ తనిఖీల తర్వాత వ్యత్యాసం ఉన్న మెటల్నిఎక్కడికి తరలించాలో చెప్పాలని..గనుల శాఖ అధికారులు నితిన్ సాయి కన్స్ట్రక్షన్ కి నోటీసులు జారీ చేశారు.
కానీ, వారి నోటీసులకు యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలోనే అక్రమంగా తరలించిన రోడ్డు మెటల్ కు ఎంత మొత్తం అవుతుందో లెక్క కట్టిన అధికారులు దానికి ఐదురెట్లు జరిమానాగా విధించారు. ఈ మేరకు మొత్తం రూ.1.60 కోట్ల జరిమానా సకాలంలో ప్రభుత్వానికి చెల్లించాలని నోటీసుల్లో తెలిపారు. ఒకవేళ చెల్లించకపోయినట్లయితే క్రషర్ యూనిట్ను సీజ్ చేస్తామని పేర్కొన్నారు.