విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపి సాంబశివ రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. త్వరలో ఆయన వైసిపిలో చేరనున్నారు. 

సాంబశివరావు తమ పార్టీలోకి రావడం శుభ పరిణామమని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. తాము సాంబశివరావు సలహాలూ సూచనలూ తీసుకుంటామని చెప్పారు. జగన్ తో సాంబశివ రావు 20 నిమిషాల పాటు చర్చలు జరిపారు.

సాంబశివ రావు 1984 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసర్. ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఎపిఎస్ ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందినవారు.