తిరుపతి వెటర్నరీ యూనివర్శిటీలో బోనులో చిక్కిన చిరుత: జూపార్క్‌కి తరలింపు

తిరుపతి  వెటర్నరీ యూనివర్శిటీ  పరిధిలో  కొన్ని రోజులుగా  సంచరిస్తున్న చిరుతను  అటవీశాఖాధికారులు బంధించారు.  మరో చిరుత  కోసం గాలిస్తున్నారు.. బంధించిన చిరుతను  జూపార్క్ కు తరలించారు. 

Forest Department Catches Leopard at veterinary university in Tirupati

తిరుపతి: తిరుపతిలోని  వెటర్నరీ యూనివర్శిటీలో  కొన్ని రోజులుగా సంచరిస్తున్న  చిరుత బోనులో  చిక్కింది.ఈ చిరుతను  ఫారెస్ట్  అధికారులు  జూపార్క్ కు ఆదివారం నాడు తరలించారు.  మూడు రోజుల క్రితం  వీసీ బంగ్లాకు సమీపంలో  కుక్కను చిరుత ఎత్తుకెళ్లింది.  వీసీ బంగ్లాకు సమీపంలో  ఏర్పాటు  చేసిన బోనులో  చిరుత చిక్కింది. దీంతో  చిరుతను ఎస్వీ జూపార్క్ కు తరలించారు.

తిరుపతి  యూనివర్శిటీ పరిధిలో  పది రోజుల క్రితం  చిరుత కన్పించింది.  రాత్రిపూట కుక్కలపై చిరుత దాడి చేసిన దృశ్యాలు  సీసీటీవీ పుటేజీల్లో రికార్డయ్యాయి.  చిరుత సంచరిస్తున్న విషయం తెలియడంతో  విద్యార్థులు ఆందోళనకు దిగారు. కొందరు విద్యార్ధులు  హస్టల్ గదులను ఖాళీ  చేసి  ఇళ్లకు  వెళ్లిపోయారు. చిరుతను పట్టుకోవాలని  హస్టల్ ఆడ్మినిస్ట్రేషన్  భవనం ముందు  విద్యార్ధులు ఆందోళనకు దిగారు. చిరుతను  పట్టుకోవాలని  విద్యార్ధులు డిమాండ్  చేశారు  యూనివర్శిటీ పరిధిలో  రెండు చిరుతలు తిరుగుతున్నాయని ఫారెస్ట్  అధికారులు గుర్తించారు. చిరుతలు తిరుగుతున్నాయని  గుర్తించి  రెండు బోన్లను  ఏర్పాటు చేశారు  అటవీశాఖాధికారులు.

శనివారం నాడు  రాత్రిపూట  చిరుత  బోనులో చిక్కింది. ఈ విషయాన్ని గుర్తించిన  అటవీశాఖాధికారులు  చిరుతను  జూపార్క్ కు తరలించారు. మరో  చిరుతను కూడా బంధించేందుకు  ఫారెస్ట్  అదికారులు చర్యలు తీసుకుంటున్నారు.  గత కొంతకాలంగా  వెటర్నరీ యూనివర్శిటీ పరిధిలో  చిరుతలు సంచరిస్తున్నాయి.  ఈ ఏడాది ఆగస్టు  16న  వెటర్నరీ  యూనివర్శిటీ  పరిపాలన భవనం  సమీపంలో  చిరుతను  గుర్తించారు.  యూనివర్శిటీ నుండి  సమీపంలోని  పొలాల్లోకి వెళ్లినట్టుగా  గుర్తించారు.   తరచూ వెటర్నరీ  యూనివర్శిటీ పరిధిలో  తరచుగా  చిరుతలు  కన్పించడంతో  విద్యార్ధులు  ఆందోళనకు దిగారు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios