ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేయడంతో బెజవాడలో సరోగసి వివాదం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన శ్రీదేవి అనే యువతికి రెండు నెలల కిందట విజయవాడలోని కార్తీక దత్త ఆస్పత్రి వైద్యులు బలవంతంగా సరోగసి చేసేందుకు ప్రయత్నించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దీనిని అడ్డుకున్న యువతి ఆస్పత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. అయితే కేసు వెనక్కితీసుకోవాలని గత కొద్దిరోజులుగా ఆస్పత్రి యాజమాన్యం నుంచి బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.