మాజీ మంత్రి పి. నారాయణకి షాక్: టెన్త్ పేపర్ల లీకేజీ కేసులో అరెస్ట్

 మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై ఇవాళ సీఐడీ అధికారులు స్పస్టత ఇచ్చే అవకాశం ఉంది. 

Fomer Minister Narayana  Takes Into Custody By AP CID Police

హైదరాబాద్: మాజీ మంత్రి Ponguru Narayanaను ఏపీ  పోలీసులు హైద్రాబాద్ లోని కొండాపూర్ లో అరెస్ట్ చేశారు.చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నారాయణ పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు.

తిరుపతిలోని Narayanaఎస్వీ బ్రాంచీలో  టెన్త్ క్లాస్   తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన టెన్త్ పరీక్షల సందర్భంగా ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. ఈ ప్రశ్నా పత్రాల లీకేజీలో నారాయణ స్కూల్స్ సిబ్బంది పాత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ విషయమై కేసులు కూడా నమోదు చేశారు. టెన్త్ ప్రశ్నాపత్రాన్ని  నారాయణ స్కూల్ కి చెందిన గిరిధర్ అనే టీచర్ లీక్ చేశారని పోలీసులు గుర్తించారు. వాట్సాప్ లో Giridhar Reddy ప్రశ్నాపత్రాన్ని చేరవేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరీక్షలు ప్రారంభమైన  కొద్దిసేపటికే  వాట్సాప్ లో పేపర్లు బయటకు వచ్చాయి.

Tenth పబ్లిక్ పరీక్షల సమయంలో పెద్ద ఎత్తున పేపర్లు బయటకు వచ్చాయి. ఈ విషయమై నారాయణ, చైతన్య స్కూల్స్ పాత్ర ఉందని తిరుపతిలో జరిగిన సభలో ఏపీ సీఎం జగన్ బహిరంగంగా ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టను దిగజార్చేసేందుకు TDP నేతలు పేపర్లను లీక్ చేశారని ఆరోపించారు. అంతేకాదు పైగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కూనడా మండిపడ్డారు. అయితే దీనికి చంద్రబాబు కూడా కౌంటర్ ఇచ్చారు. విద్యార్ధుల పరీక్ష పేపర్లు లీక్ కావాలని ఎవరైనా కోరుకొంటారా అని ఆయన ప్రశ్నించారు. పేపర్లు లీక్ కావాలని ఎవరైనా కోరుకొంటారా అని ప్రశ్నించారు. ఏపీలో పేపర్ల లీకేజ్ ఘటనకు సంబంధించి ఏపీలో సుమారు 50 మందికి పైగా టీచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలో పేపర్లు లీకేజీ అంశానికి సంబంధించి నమోదైన కేసులో భాగంగా పోలీసులు  మాజీ మంత్రి నారాయణను  చిత్తూరు పోలీసులు  ఇవాళ అరెస్ట్ చేశారు..

గత నాలుగు రోజులుగా  నారాయణ ఫోన్‌ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఙాతంలో ఉన్నారు. ఇవాళ తెల్లవారుజామునే హైద్రాబాద్ కు చేరుకున్న చిత్తూరు పోలీసులు నారాయణను అరెస్ట్ చేశారు.  టెన్త్ క్లాస్ పేపర్ల లీకేజీలో ఇప్పటికే తిరుపతిలోని  నారాయణ స్కూల్స్ కు చెందిన  వైస్‌ ప్రిన్సిపల్ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరు అరెస్ట్ చేశారు పోలీసులు.అనంతపురం, శ్రీకాకుళం, కర్నూల్, పామర్రు, ఏలూరుల లో టెన్త్ ప్రశ్నాపత్రాలు వాట్సాప్ లలో బయటకు వచ్చాయి. పేపర్ల లీకేజీ విషయమై బయటకు వచ్చాయి. ఈ విషయమై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.

హైద్రాబాద్ లో అరెస్టైన నారాయణను చిత్తూరుకు తరలించిన తర్వాత కోర్టులో హాజరు పర్చనున్నారు పోలీసులు. నారాయణ ను చిత్తూరు పోలీసులు హైద్రాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఏపీ సీఎం జగన్ తో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు.

ఇదిలా ఉంటే ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షల్లో పేపర్స్ లీకేజీకి సంబంధించి శ్రీచైతన్య స్కూల్స్  పాత్ర కూడా ఉందని  స్వయంగా సీఎం జగన్ ప్రకటించారు. అయితే శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకొంటారా అనే చర్చ కూడా ప్రారంభమైంది.
 


 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios