రెండు తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా  విరాజిల్లుతున్న శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతుంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో వర్షాలు భారీగా కురియడంతో జూరాల నుండి 87,317 క్యూసెక్కుల వరద నీరు  శ్రీశైలం జలాశయానికి చేరుతుంది.జూరాల నుండి 11 గేట్లను ఎత్తి 51,936 కూసెక్కులు అలాగే విద్యుత్ ఉత్పత్తి అనంతరం 35,381 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైల జలాశయానికి చేరడంతో జలకళను సంతరించుకున్నాయి.

శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం  835.60 అడుగులు ఉండగా శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215. 807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 55.8766 టీఎంసీల నీటి నిల్వలు డ్యాం లో అందుబాటులో ఉన్నాయి.

ఇలానే శ్రీశైలం డ్యామ్ కు ఆశించినంతగా ఎక్కువగా ఇంట్లో చేరుతూ ఉంటే మరొక 20 రోజుల్లో శ్రీశైలం డ్యాం నుండి క్రస్ట్ గేట్లను తెరచి  నాగార్జున జలాశయాలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఎగువ పరివాహక ప్రాంతాలలో రుతుపవనాలు చురుగ్గా కదలడంతో ఆయా ప్రదేశాల్లో జలాశయాలు క్యాచ్మెంట్ ఏరియాల లో ఆశించినంతగా భారీ వర్షాలు కురియడంతో ఎగువ పరివాహక ప్రాంతాల జలాశయాలకు నీటిచేరిక అధికమవడం ఎగువ రాష్ట్రాలలో ఆల్మట్టి, నారాయణపూర్ తెలంగాణ లో జూరాల ప్రాజెక్టు లో ప్రస్తుతం నీటి లభ్యత ఎక్కువగా ఉంది.

ఎగువ పరివాహక  ప్రాజెక్టుల జలాశయాల క్రస్ట్ గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేసి శ్రీశైల జలాశయం నీటిని విడుదల చేస్తూ ఉండడంతో శ్రీశైలం డ్యాం పై ఆధారపడిన రైతులు తమ పంట పొలాల్లో ఇప్పటికే నార్లు వేసుకొని పైర్లు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

అయితే గత సంవత్సరం ఆగస్టు నెల నుండి జలాశయానికి వరద ప్రవాహం మొదలైనప్పటికీ ఈ సంవత్సరం శ్రీశైలం జలాశయానికి త్వరగా వరద నీరు రావడం ఆశించదగ్గ పరిణామం. నీటి చేరిక అధికమైతే శ్రీశైల బహుళార్థ సాధక ప్రాజెక్టు ద్వారా అటు సాగునీరు త్రాగునీటికి ఇరు రాష్ట్రాల ప్రజలు నీటిని వాడుకోవడం ద్వారా పంటలు బాగా పండి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉంటారు...