వైసీపీ ఎంపీల రాజీనామాపై స్పీకర్ నిర్ణయం తీసుకొనే ఛాన్స్

న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌తో బుధవారం నాడు వైసీపీ ఎంపీలు సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా కోసం ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదిన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు.

రాజీనామాలపై వైసీపీ ఎంపీలతో ఈ అంశంపై చర్చించేందుకు ఇవాళ తమ కార్యాలయంలో కలవాలని వైసీపీ ఎంపీలకు స్పీకర్ కార్యాలయం నుండి సమాచారం వచ్చింది. ఈ సమాచారం ఆధారంగా వైసీపీ ఎంపీలు బుధవారం నాడు స్పీకర్ కార్యాలయంలో సమావేశమయ్యారు.

తమ రాజీనామాలను తక్షణం ఆమోదించాలని స్పీకర్ ను వైసీపీ ఎంపీలు కోరారు. వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి,వరప్రసాద్, అవినాష్ రెడ్డి లతో పాటు విజయసాయిరెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు కూడ స్పీకర్ తో భేటీ అయ్యారు.

ఈ ఏడాది మే 29 వ తేదిన కూడ వైసీపీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కూడ కలిశారు. తమ రాజీనామాలను ఆమోదించాలి.లోక్‌సభలో ఉన్న ఐదుగురు వైసీపీ ఎంపీలు స్పీకర్ తో సమావేశమయ్యారు.లోక్‌సభ స్పీకర్ రాజీనామాలపై బుధవారం నాడు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది
.