హత్యకు ముందు రమ్యతో ఘర్షణ : హోం మంత్రి సుచరిత
బీటెక్ విద్యార్ధిని రమ్యను హత్య చేసిన నిందితుడిని త్వరలోనే పట్టుకొంటామని హోం మంత్రి సుచరిత చెప్పారు. ఇవాళ రమ్య కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఘర్షణ పడిన తర్వాత రమ్యను నిందితుడు హత్య చేశాడని మంత్రి తెలిపారు.ఎన్ని చట్టాలొచ్చినా కూడ నిందితుల్లో మార్పులు రావడం లేదన్నారు.
గుంటూరు: బీటెక్ విద్యార్ధిని రమ్యను హత్య చేసిన నిందితుడికి దిశ చట్టం ద్వారా ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకొంటామని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత చెప్పారు.ఆదివారం నాడు ఉదయం టిఫిన్ తీసుకొని వెళ్లేందుకు వెళ్లిన రమ్యను గుర్తు తెలియని యువకుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన జరిగిన సమయంలో రమ్య అక్క మౌనిక కూడా అక్కడే ఉంది. రమ్య అక్కను కూడ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
also read:గుంటూరులో దారుణం: బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య
గుంటూరు జీజీహెచ్‌లో రమ్య కుటుంబసభ్యులను హోంమంత్రి సుచరిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. హత్యకు ముందు రమ్యతో నిందితుడు ఘర్షణ పడ్డాడని ఆమె చెప్పారు. ఎన్ని చట్టాలొచ్చినా కూడ నిందితుల్లో మార్పులు రావడం లేదన్నారు.
రమ్య కుటుంబానికి సీఎం జగన్ ప్రగాఢ సానుభూతిని తెలిపారని చెప్పారు. నిందితుడిని త్వరలోనే పట్టుకొంటామని హోంమంత్రి చెప్పారు. నిందితుడి కోసం ఐడు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయని ఆమె వివరించారు.