నెల్లూరు: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యం కావడం నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. అదృశ్యమైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి మండలంలోని జీకే పల్లి ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకొంది.  ఇద్దరు యువతులు, ముగ్గురు చిన్నారులు అదృశ్యమైనట్టుగా స్థానికులు చెప్పారు.

అనారోగ్యం కారణంగా చెకప్ చేయించుకొనేందుకు గాను వీరంతా ఆటోలో ఆసుపత్రికి వెళ్లినట్టుగా చెబుతున్నారు. ఆసుపత్రికి వెళ్లినవారి ఆచూకీ లేకుండా పోయింది. స్థానికులు ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు, పోలీసులు ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఐదుగురు ఎటు పోయారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆటోలో ఎక్కడికి వెళ్లారు.. ఆసుపత్రికి వెళ్లారా .. ఇంకా ఎక్కడికైనా వెళ్లారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సోమవారం నాడు మధ్యాహ్నం నుండి వీరి ఆచూకీ కన్పించడం లేదు. దీంతో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందినవారంతా తప్పిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.