ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా
తొలుత ఆ కుటుంబంలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. తాజాగా.. సదరు వ్యక్తి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు, అల్లుడుకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ కుటుంబంలోని ఇద్దరు శుద్ధ జల నీటి సరఫరా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ లో విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోసా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...నంద్యాలకు చెందిన ఓ కుటుంబంలో ఐదుగురికి కరోనా సోకింది. తొలుత ఆ కుటుంబంలో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. తాజాగా.. సదరు వ్యక్తి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు, అల్లుడుకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ కుటుంబంలోని ఇద్దరు శుద్ధ జల నీటి సరఫరా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
వీరిలో ఒకరికి పాజిటివ్ రావడంతో నీటి కోసం వచ్చే వారిలో ఆందోళన నెలకొంది. ఈ కుటుంబం కాంటాక్టు లిస్టును తయారు చేసి వారందరినీ క్వారంటైన్‌కు పంపే యోచనలో అధికార యంత్రాంగం ఉంది.
కరోనా కట్టడి కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మున్సిపాలిటీ పరిదిలో సామాజిక వ్యాప్తి పెరిగిపోతుండటం, కేసుల సంఖ్య పెరిగిపోతుండటం ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తాజాగా వెల్లడైన 5 కొత్త పాజిటీవ్ కేసులతో మున్సిపాలిటీలో మొత్తం కేసుల సంఖ్య 110కి పెరిగింది. రూరల్‌లోని 9 కేసులతో మొత్తం 119కి పాజిటీవ్ కేసులు చేరాయి.