చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగి.. ఐదుగురు సజీవదహనమయ్యారు. తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు గంగవరం మండలం మామడుగు సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ఘటనతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ప్రమాద సమయంలో మొత్తం కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా.... ఒకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు.

గంగవరం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు చెప్పారు. మృతులంతా తిరుపతికి చెందిన వారుగా గుర్తించారు. గాయలతో బయటపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.