నడి సముద్రం.. ఎటు చూసినా నీళ్లు తప్ప ఎవ్వరూ కనిపించని పరిస్ధితి, మరోవైపు అరకొరగా వున్న ఆహార పదార్ధాలు. ఇలాంటి పరిస్ధితుల్లో ఐదు రోజులు గడిపారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మత్స్యకారులు.

నడిసముద్రంలో బోటు వున్నట్లుంది ఆగిపోయింది. దీంతో ఎటూ వెళ్లలేక, ఐదు రోజుల పాటు అలాగే వుండిపోయారు. అటుగా వెళ్తున్న మరో బోటు సాయంతో శ్రీకాకుళం జిల్లా భావనపాడు తీరానికి చేరుకున్నారు మత్స్యకారులు.