చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఎండలు పెరుగుతుండడంతో అటవీ ప్రాంతంలో మంటలు రాజుకుంటున్నాయి. తాజాగా కాకులకోన అటవీ ప్రాంతంలో అగ్నికి ఆహుతి అవుతోంది.
చిత్తూరు జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఎండలు పెరుగుతుండడంతో అటవీ ప్రాంతంలో మంటలు రాజుకుంటున్నాయి. తాజాగా కాకులకోన అటవీ ప్రాంతంలో అగ్నికి ఆహుతి అవుతోంది.
Add Asianetnews Telugu as a Preferred Source

ఈ ప్రాంతంలో మూడు రోజులుగా మంటలు వ్యాపిస్తున్నాయి. తిరుపతి తిరుమల దేవస్థానం అటవీ విభాగం సిబ్బంది బ్లోయర్లు, చెట్లు కొమ్మల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎండలు ఎక్కువగా ఉండటం, గాలి వీస్తుండటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి, శేషాచలం అటవీ ప్రాంతం లోని వాచ్ టవర్ల ద్వారా అటవీ విభాగం సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు.
సిబ్బంది మంటలు వ్యాపించిన ప్రదేశానికి చేరుకుని తీవ్రత ఎక్కువగా లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.