సారాంశం
దేశంలో రైళ్లలో ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న ఘటనలు ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
దేశంలో రైళ్లలో ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న ఘటనలు ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఒడిశాలోని బాలసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీలోని కదిరి వద్ద లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. తాజాగా ఆదివారం రాత్రి మచిలీపట్నం నుంచి తిరుపతి వెళుతున్న రైలులో మంటలు చెలరేగాయి. రైలు టంగూటూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఉండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై చైన్ లాగి రైలును ఆపారు. ఆ తర్వాత రైలులో నుంచి కిందకు దిగారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నిలిపేసి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు 30 నిమిషాల తర్వాత రైలు తిరుపతికి బయలుదేరింది. ఇక, లూబ్రికెంట్ అయిపోవడంతో చక్రాల మధ్య రాపిడితో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది.
Also Read: ఏపీలో తప్పిన రైలు ప్రమాదం.. గేట్‌మెన్ నిర్లక్ష్యం.. లోకో పైలట్ సకాలంలో స్పందించడంతో..