Asianet News TeluguAsianet News Telugu

విశాఖ నేవీ క్యాంటిన్ వద్ద అగ్ని ప్రమాదం: మంటలార్పుతున్న ఫైరింజన్లు

విశాఖపట్టణంలోని నేవీ క్యాంటిన్ వద్ద  ఇవాళ అగ్ని ప్రమాదం  జరిగింది.  ఐదు ఫైరింజన్లతో  మంటలను ఆర్పుతున్నారు. 

Fire Breaks  out  at  navy Canteen in Visakhapatnam lns
Author
First Published Jul 3, 2023, 9:14 PM IST

విశాఖపట్టణం: నగరంలోని  నేవీ క్యాంటిన్ వద్ద  సోమవారంనాడు  రాత్రి అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.  ఐదు  ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. గత నెల  30న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని  సాహితీ ఫార్మాలో  అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.  ఈ ఘటన మరవక ముందే  మరో అగ్ని ప్రమాదం విశాఖ వాసులను  భయాందోళనలకు గురి చేస్తుంది.  

దేశంలోని పలు రాష్ట్రాల్లోని ఇటీవల కాలంలో  అగ్ని ప్రమాద ఘటనలు ఎక్కువగా నమోదౌతున్నాయి.  అగ్ని ప్రమాదాల  నివారణకు  జాగ్రత్తలు తీసుకోవాలని ఫైర్ సేఫ్టీ అధికారులు  సూచిస్తున్నారు. కానీ నిర్లక్ష్యంతో పాటు సరైన భద్రతా ప్రమాణాలు  పాటించని కారణంగా  ప్రమాదాలు  చోటు చేసుకుంటున్నాయనే  అభిప్రాయాలు కూడ లేకపోలేదు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని పెద్దపాలెంలో  జూన్  14న  అగ్ని ప్రమాదం  జరిగింది. ఈ ప్రమాదంలో ఏడాది చిన్నారి సజీవ దహనమయ్యారు.  ఈ ఘటనలో 15 పూరిళ్లు దగ్దమయ్యాయి

 ఈ ఏడాది  జూన్  24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  దర్శిలోని బట్టల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ఏడాది జూన్  16న  తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఫోటో ఫ్రేమ్ వర్స్క్ దుకాణంలో  అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఏడాది జూన్  30వ తేదీన   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో అగ్ని ప్రమాదం  జరిగింది.  ఈ ప్రమాదంలో  ఇద్దరు కార్మికులు మృతి చెందారు.  ఈ ఏడాది  జూన్  16న  ఓఎన్‌జీసీ లో  గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి.

తెలంగాణలోని  నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ ఏడాది జూన్  29న  కోడేరు మండలం ఏదుల  రిజర్వాయర్ వద్ద అగ్నిప్రమాదం  జరిగింది. తెలంగాణలోని హైద్రాబాద్ మణికొండలో  జూన్  20న  కిడ్స్ ప్లే  స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో  ఎలాంటి ప్రమాదం  చోటు  చేసుకోకపోవడంతో  అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

జూన్  15న  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  ఖుషినగర్ లో  విషాదం  చోటు  చేసుకుంది.  నిద్రపోతున్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు  చేసుకోవడంతో నిద్రపోతున్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios