చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న దూరంతో ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-9 బోగీలో మంటలు చెలరేగాయి. 

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో దురంతో ఎక్స్‌ప్రెస్‌‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న దూరంతో ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-9 బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో రైలును రైలును కుప్పం రైల్వే స్టేషన్‌లో ఆపారు. వెంటనే రైలులోని ప్రయాణికులు కిందకు దిగి పరుగులు తీశారు. అయితే వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా, ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.