శ్రీవారి ఆలయ సమీపంలోని ఆస్థాన మండపంలో ని ఓ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 షాపులు పూర్తిగా దగ్ధం కాగా మరో 8 దుకాణాలు పాక్షికంగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

తిరుమలలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ అగ్నిప్రమాదానికి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం వల్లే అని పోలీసుల దర్యాప్తులో తేలింది. మళ్లీ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం ద్వారానే తిరుమలలో అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

గత మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో శ్రీవారి ఆలయ సమీపంలోని ఆస్థాన మండపంలో ని ఓ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 షాపులు పూర్తిగా దగ్ధం కాగా మరో 8 దుకాణాలు పాక్షికంగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది.

తొలుత ఈ ఘటన షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని భావించినా... ఆ తర్వాత మళ్లిరెడ్డి మృతి పై విచారణలో పలు అనుమానాలు తలెత్తాయి. పోలీసులు విచారణను లోతుగా చేయడంతో పలు ఆధారాలను సేకరించారు. తిరుచానూరుకు చెందిన మళ్లిరెడ్డి సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నాడని.. మరుసటి రోజు ఉదయం బంకులో పెట్రోల్ పట్టుకొని షాపు నెంబర్ 84లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు సీసీ కెమేరాల దృశ్యాల ద్వారా నిర్థారణకు వచ్చారు. మళ్లిరెడ్డి ఆత్మహత్య కారణంగానే షాపులన్నీ దగ్ధమైనట్లు విచారణలో తేల్చారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్థారించారు.