తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఓ ఫొటో ఫ్రేమ్ షాపులో మంటలు చెలరేగాయి. 

తిరుపతి : తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫొటో ఫ్రేమ్ షాపులో చెలరేగిన మంటలు తీవ్రంగా ఎగిసిపడ్డాయి. దీంతో జనాలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందడంతో అక్కడిచకి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. మంటలు అంటుకున్న చోట గోందరాజు స్వామి రథం ఉంది. ఈ అగ్నిప్రమాదం కారణంగా మాఢవీదిలో రాకపోకలు నిలిపివేశారు. మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా? అనే అనుమానాలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.