విశాఖపట్టణం: విశాఖ పట్టణంలోని సెంట్రల్ జైలు వద్ద శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.

సెంట్రల్ జైలుకు సమీపంలోని నిల్వ ఉంచిన జీవీఎంసీ ప్లాస్టిక్ పైపులు తగులబడ్డాయి.ఈ విషయం తెలిసిన వెంటనే ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నారు. సెంట్రల్ జైలుకు సమీపంలోనే విశాఖ డంపింగ్ యార్డు ఉంది.

డంపింగ్ యార్డు వద్ద నిప్పు అంటించడంతో నిప్పురవ్వులు ప్లాస్టిక్ పైపులకు వ్యాపించి ఉంటాయని అగ్నిమాపక సిబ్బంది అధికారులు అభిప్రాయపడుతున్నారు.ప్లాస్టిక్ పైపులు దగ్దం కావడం వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.