విశాఖపట్నంలో (Visakhapatnam) అగ్ని ప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. మునగపాక మండలం వెంకటాపురంలో స్క్రాప్ యార్డ్‌లో మంటలు చెలరేగాయి. స్క్రాప్ యార్డులోని డ్రమ్ముల్లో కెమికల్స్ పేలడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
విశాఖపట్నంలో (Visakhapatnam) అగ్ని ప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. మునగపాక మండలం వెంకటాపురంలో స్క్రాప్ యార్డ్‌లో మంటలు చెలరేగాయి. స్క్రాప్ యార్డులోని డ్రమ్ముల్లో కెమికల్స్ పేలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 4 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్క్రాప్ యార్డులో సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్ పంజాగుట్టలో ఓ ఇంట్లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసకుంది. పంజాగుట్ట చౌరస్తా సమీపంలో ఉన్న ఓ భవనం నాలుగో అంతస్తులో వీరబాబు, మల్లీశ్వరి దంపతులు వారి కుమార్తె మౌనికతో కలిసి నివాసం ఉంటున్నారు. శనివారం వీరబాబు పనిమీద బయటకు వెళ్లాడు. మళ్లీశ్వరి, కూతురు మౌనికతో కలిసి ఇంట్లో ఉంది. మధ్యాహ్నం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఆ మంటలు కొద్ది సేపట్లోనే ఇళ్లు మొత్తం వ్యాపించాయి. దీంతో వారు ఇంట్లోనే ఇరుక్కుపోయారు.
ఇది గమనించిన చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అక్కడికి సమీపంలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికులు ఇంట్లో నీళ్లు చల్లుతుంటే.. ఇంట్లోకి ప్రవేశించి మళ్లీశ్వరి, మౌనికలను బయటకు తీసుకొచ్చారు. మరోవైపు అక్కడికి చేరుకున్న ఫైరింజన్‌లు చేరుకునేలోపే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలను లెక్కచేయకుండా ఇద్దరి ప్రాణాలను కాపాడిన శ్రవణ్ కుమార్‌ను పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసించారు.
