అనంతపురం జిల్లా పామిడిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఏటీఎం కేంద్రం అద్దాలు పగిలిపోయాయి. అగ్నిప్రమాదంలో ఏటీఎం మిషన్ పూర్తిగా కాలిపోయింది
అనంతపురం జిల్లా పామిడిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఏటీఎం కేంద్రం అద్దాలు పగిలిపోయాయి. అగ్నిప్రమాదంలో ఏటీఎం మిషన్ పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి వుంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. అలాగే ఏటీఎంలో ఎంత డబ్బుందనే దానిపై క్లారిటీ రావాల్సి వుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
