జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలులో తుని దగ్గర సీ3 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు చైన్ లాగి కిందకు పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమై, ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.