విజయవాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని బందర్ రోడ్డులో వున్న హ్యుండాయ్ సర్వీస్ సెంటర్‌లో ఈ ప్రమాదం జరిగింది, సర్వీస్ సెంటర్‌లో వున్న కార్లు ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి.

విజయవాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని బందర్ రోడ్డులో వున్న హ్యుండాయ్ సర్వీస్ సెంటర్‌లో ఈ ప్రమాదం జరిగింది, సర్వీస్ సెంటర్‌లో వున్న కార్లు ఒక్కసారిగా పేలాయి. భారీ శబ్ధంతో మంటలు చెలరేగడంతో సర్వీస్ సెంటర్‌లో వున్న ఉద్యోగులు, ఇతరులు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో లోపల 100 మంది వరకు వున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ప్రమాదానికి దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred