అక్కడ విమానం కూలిపోయిందంటూ వదంతులు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు అప్రమత్తమయ్యారు. 

చిత్తూరు జిల్లాలో విమానం కూలిందా..? అవుననే వదంతులే వినపడ్డాయి. విమానం కూలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని గ్రామస్థులు భావించారు. అయితే.. అతి పిడుగుపాటుకి విద్యుత్ తీగ తెగిపడటంతో వచ్చిన మంటలని తర్వాత తేలిసింది.

బుధవారం రాత్రి వర్షం కురుస్తున్న సమయంలో అకస్మాత్తుగా అక్కడి కొండపై పేలుడు శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందజేశారు. తీగ పడటంతో మంటలు చెలరేగి అక్కడి చెట్లు కాలిపోయాయి. వెంటనే కొద్దిసేపటికే మంటలు ఆరిపోయాయి. ఆ స్థలంలో పెద్దఎత్తున స్థానికులు గుమికూడారు.

 మరోవైపున.. అక్కడ విమానం కూలిపోయిందంటూ వదంతులు చెలరేగాయి. సమాచారం తెలుసుకున్న ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు అప్రమత్తమయ్యారు. ఎస్బీ డీఎస్పీ, నగర డీఎస్పీ, పలువురు సీఐలతో కూడిన పోలీసు అధికారుల బృందాన్ని సంఘటన స్థలానికి పంపారు. మరోవైపున ఆయన స్వయంగా తిరుపతి విమానాశ్రయంలోని ఏటీసీ(ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌)ను సంప్రదించారు. అలాంటి ప్రమాదమేమీ అసలు లేదని వారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

సామాజిక మాధ్యమాల్లో కొన్ని విషయాల్లో చోటుచేసుకుంటోన్న అవాస్తవ ప్రచారాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజశేఖర్‌బాబు సూచించారు.