గుంటూరు జిల్లా, తెనాలిలో పెను ప్రమాదం సంభవించింది. తెనాలి Government Hospitalలో Short circuit జరగటం తో పెను ప్రమాదం చోటు చేసుకుంది.Oxygen cylinder లు, పరుపులు ఉన్న గదిలో అగ్ని ప్రమాదం జరగటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. 

గుంటూరు జిల్లా, తెనాలిలో పెను ప్రమాదం సంభవించింది. తెనాలి Government Hospitalలో Short circuit జరగటం తో పెను ప్రమాదం చోటు చేసుకుంది. Oxygen cylinder లు, పరుపులు ఉన్న గదిలో అగ్ని ప్రమాదం జరగటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలు ఆర్పారు. గదిలో ఉన్న ఆక్సీజన్ సిలెండర్ లు ఖాళీవి కావడంతో పెనుప్రమాదం తప్పిందని సమాచారం. 

"

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ 30న కృష్ణాజిల్లా, గన్నవరంలో భారీ fire accident జరిగింది. ఆగిఉన్న బస్సుల్లో మంటలు చెలరేగాయి. రెండు బస్సులు అక్కడికక్కడే దగ్డం అయ్యాయి. అరగంట ముందు ఇది జరిగితే భారీ ప్రాణనష్టం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. వివరాల్లోకి వెడితే... గన్నవరం రవీంద్ర భారతీ స్కూల్ల్లో రెండు బస్సుల్లో మంటలు చెలరేగాయి. 

స్కూల్ నుండి పిల్లలను దించి వచ్చిన అరగంట లోపే ఆగి ఉన్న రెండు బస్సులు దగ్దం అయ్యాయి. బస్సుల నుండి వచ్చిన భారీ అగ్నిప్రమాదంను చూసి ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. విద్యార్థులు ఉండగా బస్సులో అగ్నిప్రమాదం జరిగితే పిల్లల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. భయాందోళనలు చెందుతున్నారు. ఎట్టకేలకు ఫైర్ సిబ్బంది వచ్చి అగ్నిప్రమాదం జరిగిన బస్సులను ఆర్పుతున్నారు.