అత్తాకోడళ్ల మధ్య జరిగిన గొడవలో అత్తను దారుణంగా హింసించిన ఘటన విజయనగరంలో జరిగింది.
విజయనగరం : అత్తాకోడళ్ల మధ్య జరిగిన తగాదా ఘర్షణకు దారి తీయడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరికి అత్త ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని రావివలసలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గ్రామానికి చెందిన గుంట్రెడ్డి రాములమ్మ (65)కు నలుగురు కుమారులు, ప్రస్తుతం ఈమె చిన్న కుమారుడు శివకుమార్, కోడలు గౌరీశ్వరి వద్ద ఉంటున్నారు. తరచూ అత్త, కోడలు మధ్య తగాదాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు.
గురువారం ఉదయం ఆర్ఎంపీగా చేస్తున్న శివకుమార్ పనిమీద బయటకు వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య వాదులాట జరిగింది. ఇంటి లోపల గడియ వేసి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో అత్తను నెట్టి, ఆమెపై కూర్చొని ముఖాన్ని బలంగా పలుమార్లు నేలకు కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ముఖమంతా రక్తసిక్తమై రాములమ్మ అక్కడే ప్రాణాలు కోల్పోయింది. కొంతసేపటికి వచ్చిన శివకుమార్ తల్లి రక్తపుమడుగులో ఉండటాన్ని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్వతీపురం డీఎస్పీ, పాలకొండ నుంచి పోలీసు బృందాలు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.
ఇదిలా ఉండగా, మే2న బీహార్ రాష్ట్రంలో తాజాగా దారుణం వెలుగుచూసింది. కోడలు గ్రామంలోని మరో వ్యక్తితో illegal affair పెట్టుకుందనే అనుమానంతో అత్తామామలే ఆమెను విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన రోహతాస్ జిల్లాలో సంచలనం రేపింది. అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ మహిళను Power pole కి కట్టేసి కొట్టారని రోహతాస్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆశిష్ భారతి చెప్పారు. ఈ కేసులో బాధితురాలి భర్త, అత్తామామలు, బంధువులు ఐదుగురిని అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. పోలీసు అధికారులు జంటను పోలీస్ స్టేషన్ కు పిలిపించి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ దారుణ ఘటనమీద దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు.
